ఆర్థిక సాయం అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-నిజాంపట్నం: ఇటీవల మండలంలోని అడవులదీవి పంచాయతీ పరిధిలోని గుణ్ణంతిప్ప గ్రామంలో గోపి, అర్జునరావులకు చెందిన రొయ్యల కంపెనీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ విషయాన్ని అడవులదీవి సర్పంచ్ శొంఠి శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకుని ఎంపీపీ మోపిదేవి హరినాథ్‌బాబు దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన అయన శనివారం సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు త్వరలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శొంఠి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు వీరంకి ముక్తేశ్వరరావు, శేషు, రాంబాబు, గుడారయ్య తదితరులు పాల్గొన్నారు.










