ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని అంతాడా పంచాయతీ శివారు తాటిమనిపాలెంలో ఈ నెల 22న జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఏడు కుటుంబాలకు స్థానిక ఎంపీటీసీ ఇరవాడ సత్యవాణి శుక్రవారం ఆర్థిక సహాయం, నిత్యవసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయంతో పాటు స్కీం ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఇరవాడ దేవుడు, ఉల్లి సత్యనారాయణ, నానాజీ, మొల్ల నాగరాజు, పొట్టకూరిదార మల్లేష్, గుమ్మ రాంబాబు, పాంగి విజరు కుమార్, పాంగి ఓలయ పాల్గొన్నారు.
లోకుల గాంధీ ట్రస్టు ఆధ్వర్యాన
తాటిమనిపాలెం అగ్ని ప్రమాద బాధితులకు లోకుల గాంధీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ మఠం మురళీకృష్ణ బియ్యం, కూరగాయలు, నిత్యవసరం సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రీమల చంద్రరావు, అర్జున్ రెడ్డి, సర్పంచ్ సుర్ల చంద్రరావు పాల్గొన్నారు.










