Dec 05,2022 00:01

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సాయం చేస్తున్న కోరాడ రాజబాబు

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు పరిధి గొల్లవీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైన నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి టిడిపి ఆధ్వర్యాన సాయం చేశారు. నిత్యావసర సరుకులు, దుస్తులు, కొంత నగదును పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు బాధిత కుటుంబానికి ఆదివారం అందజేశారు. బాధితులు అప్పలనరసమ్మ, ఎర్రయ్యరెడ్డిని పార్టీ నాయకులు ముందుగా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ గొలగాని నరేంద్ర కుమార్‌, టిడిపి నాయకులు ఎం.సంజీవకుమార్‌, గండిబోయిన పోలిరాజు, కొక్కిరి అప్పన్న, డి.సత్యనారాయణ, కె.కామేష్‌ పాల్గొన్నారు.