Mar 13,2023 22:53

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
              రెండున్నర దశాబ్దాలుగా సూక్ష్మ కళలో అద్భుత నైపుణ్యం కనబరుస్తూ ఏలూరు నగర కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారు ప్రముఖ కళాకారుడు మేతర సురేష్‌. ఇప్పటికే ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందిన ఆయన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని సూది మొనలో జాతీయ పతాకాన్ని నిర్మించి ఔరా అనిపించిన ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూ.. గ్లోబల్‌ అవార్డుతో పాటు, ఆస్కార్‌ అందుకున్న తొలి తెలుగు సినిమా త్రిబుల్‌ ఆర్‌ స్ఫురిస్తూ ప్రముఖ హీరోలు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ చిత్రాలను అగ్గి పుల్లపై చెక్కి మరోమారు భారతీయ అభిమానాన్ని చాటుకున్నారు.