ప్రజాశక్తి -హుకుంపేట:వరి పంటలో అగ్గి తెగులు ఆశించి పంటను తీవ్ర నష్టపరుస్తుందని తగిన జాగ్రత్తలు పాటించాలని రైతులకు శాస్త్రవేత్త చిట్టిబాబు సూచించారు. మండలంలోని సట్రాయి పుట్టు, సుకూరు గ్రామాల్లో ఏరువాకలో భాగంగా వ్యవసాయ అధికారులు లీలావతి, విజయలక్ష్మిలతో మంగళవారం స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పిలక దశ నుంచి పొట్ట దశకు చేరుకుం టుందన్నారు. అడపా దడపా వర్షాలు కురుస్తుండటంతో అగ్గి తెగులు విపరీతంగా ఆశించి పంటలు ఎండి మచ్చలు ఏర్పడు తున్నాయన్నారు. తెగులు నివారణకు సుడోమోనాస్ ఒక కిలో చొప్పున 200 లీటర్ల. నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు.తెగులు ఉదృతి ఎక్కువగా ఉంటే ట్రై సైక్లోజోల్ 120 గ్రాముల చొప్పున ఎకరానికి పిచికారి చేయాలని రైతులకు సూచించారు.










