Nov 18,2022 16:05

ప్రజాశక్తి-అడ్డతీగల :  స్థానిక మండల కేంద్రంలో ఆదివాసీలఆత్మ గౌరవ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి .అంటూ నినాదాలు చేస్తూ అడ్డతీగల పురవీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేవి గుడి సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి మన్యం వీరుల చరిత్రను గుర్తు చేస్తూ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, గాము గంటన్న దొర, మల్లు దొర, మన్యం వీరుల గాదను విద్యార్థిని విద్యార్థులు తెలియజేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ బాలుర పాఠశాల నుండి ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు, గోము కృష్ణ, ఆశ్రమ పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి శాంతిమతి, వరదానం, స్వర్ణాంజలి, వీరబాబు, బాల రెడ్డి, పల్లం రాజు మొదలగు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.