అధ్యాపకులను సన్మానిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు తిక్క వరకు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా కళాశాలనకు వచ్చిన ,కళాశాల నుంచి వెళ్లిన వారికి ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం కళాశాల ఫిజికల్ డైరెక్టర్ తొట్టెంపూడి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి బదిలీపై వెళ్లిన అధ్యాపకులు సిహెచ్ రవిబాబు, చల్ల శ్రీనివాసులు ,నారాయణమ్మలను సన్మానిం చారు. కళాశాలలో వారి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బదిలీపై మన కళాశాలకు వచ్చిన ఉర్దూ, ఫిజిక్స్ ,తెలుగు, అర్థశాస్త్రం అధ్యాపకులు మాధవ రావు, రమేష్ లను కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు పరిచయం చేశారు. అధ్యాప కులు మస్తాన్వలి ,వెంకటేశ్వరరావు ,బాబురావు, శిరీష ,ఉష ఉన్నారు.










