ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి ఒకటో వార్డు పరిధిలో ఎక్కడికక్కడే రోడ్లు మరమ్మతుకు గురయ్యాయి. ఈ గుంతల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు గుంతలో నుంచి వెళ్లే సమయంలో దానిలో ఉన్న బురద నీరు పాదచారులపై తుళ్లుతోంది. వాహనదారులు కుదుపునకు గురవుతున్నారు. చిట్టివలస జ్యూట్ మిల్లు రోడ్డుకు వెళ్లేదారిలో ముఖద్వారం వద్ద (పెట్రోల్ బంక్ సమీపంలో) తారు రోడ్డుపై గుంత ఏర్పడింది. రోడ్డు కొద్ది మేర కోతకు గురైంది. బొగ్గురొడ్డుకు వెళ్లే మార్గంలో గుంతలు ఏర్పడ్డాయి. మే నెలలోనే జివిఎంసి నిధులు రూ.19 లక్షలతో చిట్టివలస జ్యూట్ మిల్లు రోడ్డు, మెయిన్ రోడ్డు తదితర చోట్ల రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. ఇంతలోనే రోడ్లపై గోతులు ఏర్పడడంపై రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై విమర్శలు వినిపిస్తున్నాయి.










