రాళ్లు తేలిపోయి అధ్వానంగా ఉన్న మఠం భీమవరం రహదారి
ప్రజాశక్తి - కొయ్యూరు
మండలంలోని సుదూర పంచాయతీ మఠం భీమవరం గ్రామానికి వెళ్లే రహదారి చాలా అధ్వానంగా తయారైంది. మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ పంచాయతీకి వెళ్లాలంటే ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మట్టి రోడ్డు కావడంతో వర్షాలకు పెద్ద పెద్ద బండరాళ్లు తేలిపోయాయి. కాలినడకన కూడా రాకపోకలు సాగించడం ఇబ్బందిగా ఉంది. పెద్ద వాహనాలే కాదు ద్విచక్ర వాహనాలు సైతం ప్రయాణించడానికి ఈ మార్గం అనుకూలంగా లేదు. దీంతో చుట్టూ తిరిగి సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించి, మండల కేంద్రానికి చేరుకునే పరిస్థితి నెలకొంది. తక్షణమే తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.










