Sep 28,2023 21:11

కొమరాడ: అధ్వాన్నంగా తయారైన రహదారి

ప్రజాశక్తి - కొమరాడ : మండలంలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వాహ్నంగా ఉన్నాయి. ఈ రోడ్లుపై ప్రయాణించాలంటే గిరిజనులకు తిప్పలు తప్పడం లేదు. ఇందుకు నిదర్శనం నాగావళి నది ఆవిల ఉన్న పాలెం పంచాయితీకి వెళ్లే రోడ్డు. ఈ రహదారి అధ్వానంగా ఉండడంతో గిరిజనులు రాకపోకలు చేసేందుకు నానా కష్టాలుపడుతున్నారు. పాలెం పంచాయతీ పరిధిలో కుంబికోట, మర్రిగూడ, రావికోన, గొందిలోవ, వాడపుట్టి తదితర సుమారు 10 గ్రామాల ప్రజలకు రోడ్డు సమస్య పట్టిపీడిస్తుంది. ఈ గ్రామాలన్నీ పాలెం మీదుగా రావికోన వరకూ చుట్టు పక్కల ఉండే ఈ గ్రామాలకు రోడ్డు సదుపాయం లేక నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సేవల కోసం గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 108 సదుపాయం కరువయ్యే పరిస్థితి ఉంది. పాలెంలో సచివాలయం ఉన్నప్పటికీ రోడ్డు సదుపాయం లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యమా రాజకీయ నాయకుల వైఫల్యమా ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం కరువైందని బాధిత గ్రామాల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఓట్లు దండుకోవడానికి వస్తారే తప్ప ఆ గ్రామాలను పట్టించుకొనే నాధుడే కరువైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ఆ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
చినుకు పడితే చిత్తడే..
సాలూరు రూరల్‌: మండలంలోని యారగడ వలస, మావుడీ గ్రామాల మధ్యలో నిత్యం అరటి, పామాయిల్‌ పట్టుకు వెళ్ళే లారీలు పదుల సంఖ్యలో తిరుగుతుంటాయి. ఈ మధ్యలో రాధిక వెజిటిబుల పామాయిల్‌ వే బ్రిడ్జి కూడా వుండటంతో చాలా రద్దీగా ఉంటుంది. అటువంటి రోడ్‌ వర్షం పడితే మొత్తం గుంతలు ఏర్పడి పాదచారులు ద్వి చక్రవాహనదారులు నడక యాతన పడుతున్నారు. మరమ్మతుకు గురైన రోడ్డును బాగుచేయాలని ప్రయాణి కులు కోరుతున్నారు.