Mar 05,2023 00:54
రేపల్లె రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్న రైల్వే డీఆర్‌ఎం రామకృష్ణ తదితరులు

ప్రజాశక్తి-రేపల్లె: రైల్వేస్టేషన్‌ల ఆధునికీకరణలో భాగంగా గుంటూరు డివిజన్‌లో 16 రెల్వేస్టేషన్‌లను గుర్తించామని, వాటిలో రేపల్లె రైల్వేస్టేషన్‌ ఒకటని రైల్వే డీఆర్‌ఎం రామకృష్ణ తెలిపారు. రేపల్లె రైల్వేస్టేషన్‌ను శనివారం ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. ఆధునికీకరణలో పాసింజర్‌ల సౌకర్యాలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. అప్రోచ్‌రోడ్డు, ప్లాట్‌ఫామ్‌ల సెంటర్స్‌ వెడల్పు చేయటం, వేచి ఉండే గది, ఏసీ వెయిటింగ్‌ హాలు, మహిళలు వేచి ఉండే గది, తాగునీరు తదితర సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. బస్టాండ్‌వైపు ఉన్న రైల్వే ద్వారాన్ని సైతం అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇంకా ఆయన వెంట రైల్వే సిబ్బంది ఉన్నారు.