తాడేపల్లి రూరల్ : కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో ఆధునిక గణిత పధ్ధతులు, వాటిని ఉపయోగించే విధానాలపైన గణిత విభాగం వారు రెండు రోజుల అంతర్జాతీయ కార్యశాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యశాలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా వారు ఆర్ధిక సహకారం అందిచగా, పశ్చిమబెంగాల్ లోని ఎన్‌ఐటి నుండి ప్రొఫె సర్ అనితా పాల్, గౌహతిలోని ఐఐటి నుండి ప్రొఫెసర్ నటేషన్ శ్రీనివాసన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన అలహా బాదులోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ప్రొఫెసర్ పంకజ్ శ్రీవాత్సవలు ముఖ్యఅతిథులుగా హాజరవగా శ్రీలంకలోని కొలంబో యూనివర్శిటీ నుండి డాక్టర్ ఎస్‌ఎస్‌ఎన్.పెరేరా ఆన్ లైన్ ద్వారా విద్యార్ధులతో మాట్లాడారు. కెఎల్ యు ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్. జగన్నాథరావు జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారం భించి విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అనితా పాల్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొం టున్న ఆహార పదార్ధాల కొర తను అధిగ మించేందుకు గాను టమాట వంటి కూర గాయలు, ఆహార పదార్ధాలను అధికంగా లభించిన సమయంలో నిల్వ చేసి అవసరమైన కాలంలో ప్రజలకు సరఫరా చేయడం ద్వారా లాభాలను పొందేందుకు అవసరమైన గణిత పద్ధతులను తాను రూపొందించి పరిశోధనా పత్రాల ద్వారా విశదీక రించారు. కొలంబొ యూనివర్శిటీకి చెందిన ఆచార్యులు డాక్టర్ పెరేరా మాట్లాడుతూ సంక్రమిత అంటు వ్యాధులు, వాటి నిర్మూలన కోసం తీసుకోవాల్సిన గణిత విధానాలను తన అధ్యయన పత్రం ద్వారా వివరించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అలహాబాదులోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి డాక్టర్ పంకజ్ శ్రీవాత్సవ తన పరిశోధనాపత్రం సమర్పించారు.










