Sep 11,2023 23:55

ప్రజాశక్తి - పర్చూరు
స్థానిక టిడిపి కార్యాలయంలో సామూహిక దీక్ష చేశారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్, ఎన్టీఆర్, రంగా విగ్రహాలకు పూలమాల మాల వేసి నివాళి అర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక నిరాహార దీక్షలు చేశారు. టిడిపి కార్యాలయం నుండి బొమ్మలసెంటర్‌ వరకు ర్యాలి నిర్వహించారు. అరాచక ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని నినాదాలు చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి, టిడిపి ఇంకొల్లు మండల అధ్యక్షులు నాయుడు హనుమంతరావు, టిడిపి మండల మాజీ అధ్యక్షుడు మానం హరిబాబు, టిడిపి నాయకులు గొట్టిపాటి వెంకటరావు, అగ్నిగుండాల వెంకటకృష్ణ, కాపు రవిచంద్ర, గౌస్, దాసి కిరణ్, మల్లికార్జున్, తంగెళ్ళ మల్లికార్జునరావు, సాంబయ్య , శ్రీధర్,సాంబశివరావు, వెంకటేశ్వర్లు, మహిళా నేతలు జయమ్మ, రావిపాటి సంధ్య, ఉప్పుటూరి రమాదేవి, బత్తుల కృష్ణవేణి, రుక్మిణి పాల్గొన్నారు. పర్చూరు, కారంచేడు, యద్దనపూడి, చిన్నగంజాం, ఇంకొల్లులో టిడిపి నేతలను వేకువజామునుండే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భంధించారు. స్టేషన్లలోనే నిరసన దీక్షలు చేశారు.