May 04,2023 23:35

వాకాడ లో ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ కన్నబాబు




ప్రజాశక్తి -కరప
ఇటీవల నాలుగు రోజుల నుండి కురిసిన వర్షాలకు రైతుల వద్ద ఉన్న మొలకలెత్తి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా మండల వ్యవసాయ అధికారులు కొనుగోలు చేయకపోవడంపై కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంట అనేక చోట్ల దెబ్బతిని రైతులు ఆపదలో ఉన్నారని పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. వాకడ, నడకుదురు గ్రామంలో తడిసిపోయి మొలకెత్తిన ధాన్యం రాశులను, నేల కొరిగి నీట మునిగిన వరి పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. దళారులు ద్వారా రైతులకు నష్టం కలిగించే విధంగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని వాకాడ గ్రామంలో రైతులు కన్నబాబు దృష్టికి తీసుకురాగా వ్యవసాయ అధికారులతో ఫోన్లో సంప్రదించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటివరకు తక్కువ ధరకు కొనుగోలు జరిగిన ధాన్యాన్ని మిల్లర్ల నుండి వెనక్కి రప్పించి ఆర్‌బికెల ద్వారా అదే ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం దళారుల ద్వారా మిల్లర్లు చెల్లించే దాని కంటే రూ300 ఎక్కువ వచ్చే విధంగా విక్రయించిన దానికి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని రైతులు అధైర్య పడద్దని కన్నబాబు భరోసా ఇచ్చారు. వేములవాడ గ్రామంలో ఇన్చార్జ్‌ ఆర్‌డిఒ జె సీతారామారావు, తహశీల్దార్‌ పొన్నమండ శ్రీనివాసరావు, ఆర్‌ఐ మాచరావు, అగ్రికల్చర్‌ అధికారుల బందంతో కలిసి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎడిఎ బాబురావు, ఎఒ రాజేష్‌, జడ్‌పిటిసి వై.సుబ్బారావు, సత్య ప్రసాద్‌, బుచ్చిబాబు బండి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.