ప్రజాశక్తి-పాయకరావుపేట:గత సర్వసభ్య సమావేశంలో సమస్యలు పరిష్కరించలేని సమావేశం ఎందుకని సర్పంచులు అధికారులను నిలదీసారు. పాయకరావుపేట మండల కాంప్లెక్స్ ఆవరణలో శ్రీ శక్తి భవనంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఇసరపు పార్వతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మేరకు శ్రీరాంపురం సర్పంచ్ గారా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, గత సమావేశంలో ఆమోదించినవి ఇప్పటికీ పరిష్కారం కాలేదని, నాడు నేడు పనుల్లో భాగంగా ఉపాధ్యాయులు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించ లేదన్నారు. నిధులపై ఉపాధ్యాయులు చెప్పడ లేదని మండల విద్యాశాఖ అధికారినీ కే.గాంధీని నిలదీసారు. పాల్మాన్‌పేట సర్పంచ్ కోడా కోటేశ్వరరావు, ఈదటం ఎంపిటిసి పంచాయతీ కార్యదర్శి సమీరాపై సర్వసభ్య సమావేశంలో ఫిర్యాదు చేశారు. కార్యదర్శి ఎప్పుడు గ్రామానికి రాలేదని, పంచాయతీ సమావేశాలు పెట్ట లేదని గతంలో ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లంక సూరిబాబు, ఎంపీపీ పార్వతి తాతారావు, వైస్ ఎంపీపీ దనిశెట్టి మాధవి, ఎంపీడీవో ఏ.సాంబశివరావు, ఈవోపీఆర్డీ చంద్రశేఖర రావు, సర్పంచులు రారా కృష్ణ ప్రసాద్, వంక రమణ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.










