ప్రజాశక్తి - చింతలపూడి
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో ఆర్మి అధికారులతో పాటు, పోలీసు ఉన్నత అధికారులను పోగొట్టుకోవటం బాధాకరమని యర్రగుంటపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠాశాల ప్రధానోపాధ్యాయులు విస్సంపల్లి బాబురావు తెలిపారు. బాబురావు అధ్యక్షతన పాఠశాల అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో కోకేర్ నాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారులతో పాటు, డిఎస్‌పి అధికారి 'హుమాయూన్ భట్'లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.










