Jan 27,2023 23:54

ఎంపిడిఒను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-నక్కపల్లి:ఉత్తమ ఎంపీడీవోగా జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు పొందిన ఎంపీడీవో డి.సీతారామరాజును శుక్రవారం పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు సన్మానించారు. మండల పరిషత్‌ సమావేశం మందిరంలో శుక్రవారం ఎంపీడీవోగా పురస్కారం అందుకున్న సీతారామరాజును ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ నక్కపల్లి సర్పంచ్‌ నేతల జయరత్నకుమారి, వైస్‌ ఎంపీపీ నానాజీ, ఈవోఆర్డీ వెంకట నారాయణ, ఉపాధి హామీ పథకం ఏపీఓ ఈశ్వరరావు సత్కరించారు.
రావికమతం:ఉత్తమ పురస్కారాలు అందుకున్న రావికమతం మండలం తహసీల్దారు ఉమామహేశ్వరరావు, మండల సర్వేయర్‌ సత్యనారాయణలను వైసిపి నాయకులు, మండల ఆగ్రో అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ కంచిపాటి జగన్నాధరావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బంటు సన్యాసినాయుడులు మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జగ్గారావు మాట్లా డుతూ, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి అధికారికి మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు.ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే చక్కగా నిర్వహించారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో తహశీల్దారు కృషి చేస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో మండలానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పని చేసి మరిన్ని ఉత్తమ పురస్కారాలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుడ్డిప సర్పంచ్‌ గుమ్మాల గణేశ్వరరావు, కెబిపి అగ్రహారం సర్పంచ్‌ కలిగిరి ప్రసాద్‌ పలువురు పాల్గొన్నారు.