Aug 16,2023 20:02

అవార్డు తీసుకున్న వారితో సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం అందజేసిన ఉత్తమ సేవా అవార్డులు ఆదోని అధికారులు పొందడం అభినందనీయమని ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ కొనియాడారు. బుధవారం వారిని పలువురు అభినందించారు. ఉత్తమ సేవలు అందించినందుకు ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డీఎస్పీ శివ నారాయణ స్వామి, వన్‌ టౌన్‌ సిఐ విక్రమ సింహా, ఎఎస్‌ఐ సమ్మద్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ వీరారెడ్డి, కానిస్టేబుల్‌ రామచంద్రలు, మున్సిపాలిటీ విభాగంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, సీనియర్‌ అసిస్టెంట్‌ జూబియా సుల్తానా, ఉద్యోగులు శాంతి కుమారి, ఈరన్న, సచివాలయ వార్డు సెక్రటరీలు వేణుగోపాల్‌, యశస్విని, అశోక్‌, నాగరాజు, పావని, సరోజలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

అవార్డు అందుకుంటున్న డీఎస్పీ శివ నారాయణ స్వామి
అవార్డు అందుకుంటున్న డీఎస్పీ శివ నారాయణ స్వామి