గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకరరావు
ప్రజాశక్తి - అచ్చంపేట : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయో లేదో తెలుసుకునేందుకే 'మనకోసం మన శంకరన్న' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. బుధవారం అచ్చంపేట మండల పరిధిలోని కోనూరు, కస్తల గ్రామాల్లో గ్రామ సభలో ఏర్పాటు చేశారు. కస్తలలో మురుగునీరు పోయే మార్గం లేదని కల్వర్టు, ఏర్పాటు చేయలని కోరగా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెప్పారు. లోవోల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ సమస్యలను వారంలో పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారులు పట్టించుకోకుంటే తనకు ఫోన్ చేయాలని స్థానికులకు చెప్పారు.










