ప్రజాశక్తి - దేవనకొండ
దేవనకొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో బుధవారం మండల స్థాయి అధికారుల పనితీరుపై మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎంపిడిఒ గౌరీ దేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్య ధోరణి వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండి తమ సేవలను అందించాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సాయిబాబా తెలిపారు. తహశీల్దార్ వెంకటేష్ నాయక్, ఇఒఆర్‌డి సూర్యనారాయణ, సిహెచ్‌ఒ భాగ్యలక్ష్మి, హౌసింగ్ ఇంజినీర్ అనిరుధ్, పంచాయతీ ఇన్‌ఛార్జీ అధికారి ఉదరు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సుమిత్ర పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి శ్రీనివాసులు










