Aug 17,2023 00:05

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలారి రోశయ్య

చేబ్రోలు: మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు కొక్కిలి గడ్డ సాహితీ కిరణ్‌ అధ్యక్షతన బుధవారం చేబ్రోలు మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు ప్రభుత్యం సమర్ధ వంతంగా నిర్వహించడానికి అధికారుల పర్యవేక్షణ పనితీరు చాలా ముఖ్యమని అన్నారు. అభివృద్ధి పనుల నిర్వహణలో భాగమైన కాంట్రాకర్లు, బిల్డర్లకు బిల్లులు చెల్లించే విష యంలో అధికారుల పనితీరు వల్ల ఇబ్బందులు కలుగ కూడ దని అన్నారు. ప్రభుత్వ నిధులు సకాలంలో ఇస్తున్న ప్పటికి అధికారుల పని నిర్లక్ష్యం వలన బిల్లులు చెల్లింపులో ఆలస్యం కావడం సబబు కాదని, ప్రజల ఉపయోగార్థం చేసే అభి వృద్ధి పనులకు ఆటంకం కలగకుండా, వేగవంతంగా జరి గేలా తమ పని విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. వ్యవసాయాన్ని మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్స్‌ వినియోగం వచ్చే నెల నుంచి మండలంలో ప్రారం భం కానున్న నేపథ్యంలో గ్రామా ల్లో ఆసక్తిగా ఉన్న యువతను ప్రోత్సహించి శిక్షణ ఇవ్వడం వల్ల మరింత ప్రయోజనం చేకూరి అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారికి సూచించారు. సమావేశంలో మండల పరిషత్‌ అబివృద్ధి అధికారి బి.బాబురావు, తహ శీల్దార్‌్‌ కెవి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు , వేజెండ్ల సొసైటీ చైర్మన్‌ సిహెచ్‌ సాంబశివరావు, జిడిసిఎం ఎస్‌ కె.పాములు, మండల, గ్రామస్థాయి అధికారులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఉత్తమ సేవా పురస్కారాలను పొందిన తహశీల్దార్‌ కె వి గోపాలకృష్ణ, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఎపిఎం ఆనందమోహన్‌, శలపాడు సచివాలయం సర్వే యర్‌ కవితలను ఎమ్మెల్యే అభినందించారు. కొత్తగా చేబ్రోలు తహశీల్దారుగా వచ్చిన కెవి గోపాలకృష్ణ సమర్థవం తమైన సేవలను అందించడమే కాకుండా గ్రామా లకు వెళ్లి ప్రజల, రైతు సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రశంసిం చారు. తహశీల్దార్‌ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు,ప్రజలు సహకారంతో మండల రెవెన్యూ శాఖ సర్వీసులు సక్ర మంగా అందుతున్నాయని అన్నారు. గ్రామ సచివాల యాల ద్వారా వచ్చిన 10,600 అర్జీలను, 486 రేషన్‌ కార్డుల సమస్యలను, 1120 రైతులు, కౌలు రైతులకు సం బంధించిన 650కు పైగా దరఖాస్తులను పరిష్కరించి నట్లు వివరించారు.