Nov 17,2023 19:40

టిడిపి మేనిఫెస్టోను వివరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోనిరూరల్‌
టిడిపి, జనసేన ప్రభుత్వం వస్తే అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆ పార్టీల నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు మీనాక్షి నాయుడు, మల్లప్ప తెలిపారు. శుక్రవారం మండలంలోని ఆరేకల్‌ గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ'లో భాగంగా గ్రామంలో కరపత్రాలను, బాండ్లను పంపిణీ చేశరు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అవంలభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. బాబు అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాల్లో కరువు తాండవిస్తోందని తెలిపారు. ఇక్కడ ఉండలేక సుదూర ప్రాంతాలైన గుంటూరు, విజయవాడ, తెలంగాణకు వలస పోతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రామస్వామి, రంగన్న, ఆరేకల్‌ రామకృష్ణ, దొడ్డనకేరి శివప్ప, జనసేన నాయకులు రమేష్‌ యాదవ్‌, వేణు వర్మ, పులి రాజు, శంకర్‌ రెడ్డి, భీమా, నాగరాజు, నీలకంఠ పాల్గొన్నారు.