Sep 24,2023 01:30

ప్రజాశక్తి- సంతమాగులూరు
అధికార వైసిపిలో విభేదాలు మండల పరిషత్‌ సమావేశం వేడికగా బహిర్గతమయ్యాయి. 17ఎంపీటీసీలు, జడ్పిటిసి, సర్పంచులు మొత్తం దాదాపుగా వైసిపినే గెలిచింది. సంతమాగులూరుకు చెందిన అట్ల చిన్నవెంకటరెడ్డి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన సోదరుడు అట్లా పెద్ద వెంకటరెడ్డి వైసీపీ మండల కన్వీనర్‌గా ఉండి స్థానిక సంస్థలను ఏకపక్షం చేయడంలో ప్రభావం చూపారు. ఆ తర్వాత అట్లా చిన్న వెంకటరెడ్డి ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన బలపరిచిన వ్యక్తినే తిరిగి ఎంపీపీగా ఎన్నుకున్నారు. పార్టీ బాధ్యతలను తెలుగుదేశం నుండి వైసీపీ పార్టీలో చేరిన చింతా రామారావుకు అప్పగించారు. అప్పటి నుండి పార్టీలో అసంతృప్తులు మొదలైనట్లు స్థానిక నేతలు తెలుపుతున్నారు. రూ.60లక్షలకుపైగా టిడిపి ప్రభుత్వం నాటి బిల్లులను మంజూరు చేశారు. వైసిపి ఇన్‌చార్జి కృష్ణ చైతన్య సహకరించారని అంటున్నారు. మండలంలో ఉన్న రూ.50లక్షల నిధులను ఎంపీటీసీలు చేసిన బిల్లులకు చెల్లించాలని మరో గ్రూప్ పట్టు పడుతుంది. ఇన్‌ఛార్జి అనుమతి లేకుండా తీర్మానం చేయడంతో సమావేశానికి వచ్చిన కొందరు ఎంపిటిసిలు వెళ్లిపోయారు. టిడిపి గ్రూపు వారికే బిల్లులు చేస్తున్నారంటూ ఎంపీడీవో వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు జరగాల్సిన సమావేశం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగింది. ఆరుగురు సభ్యులతో సమావేశం ప్రారంభమైంది. మరో ముగ్గురు తర్వాత వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. నిన్నటి వరకు నివురు కప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు బహిర్గతమయ్యాయి.