Oct 18,2023 21:09

సమావేశంలో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రాజు

మదనపల్లె అర్బన్‌ : అధికార వైసిపి కుట్రలను తిప్పికొడతామని, తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివద్ధి సాధ్యమని టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు పేర్కొన్నారు. రాజంపేట పార్ల మెంట్‌ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుధవారం ఆయన తొలిసారిగా మదనపల్లికి విచ్చేశారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియో జకవర్గం నాయకులు షాజహాన్‌ బాషా ఆహ్వానం మేరకు బెంగళూరు బస్టాండులోని పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చమర్తి జగన్మోహన్‌ రాజును షాజహాన్‌ బాషా పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్‌ రాజు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.రాష్ట్రంలో అభివద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. కేవలం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడు తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమ ర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. షాజహాన్‌ బాషా మాట్లాడుతూ టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులుగా జగన్మోహన్‌ రాజు నియామకం హర్షిణీమన్నారు. తెలుగుదేశం పార్టీ అభివద్ధి కోసం ఆయన నిర్విరామ క షి చేశారని కొనియాడారు.ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం సరైన పదవిని అప్పజెప్పిందని కితాబునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జునైద్‌ అక్బరీ, ఎస్‌.ఏ.మస్తాన్‌, పఠాన్‌ ఖాదర్‌ ఖాన్‌, నాగూర్‌ వలి,షంషీర్‌,నాదెండ్ల విద్యాసాగర్‌, నవీన్‌ చౌదరి, బాలు స్వామి, దొరస్వామి నాయుడు, రాటకొండ మధుబాబు, మార్పూరి సుధాకర్‌ నాయుడు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.