ప్రజాశక్తి-రామచంద్రపురం
గత కొద్ది అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం బెంబెలెత్తుతున్నారు. ఈ ఏడాది వర్షభావంతో పాటు వాతావరణం లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. జూన్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. మెయిన్ రోడ్లన్నీ మధ్యాహ్నానికి కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నాయి. వేసవి కంటే దారుణంగా ఉక్కపోత అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు పలుచోట్ల తొలకరి పంటలకు తెగుళ్లు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాతావరణ శాఖ ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గటమే కాకుండా ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయని ప్రకటించడంతో ప్రజలు హడెలెత్తిపోతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వేసవి ఉష్ణోగ్రతను తలపిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మధ్యాహ్నం అయ్యే సరికి పలువురు వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.










