
'ప్రజాశక్తి' వార్తకు స్పందన
ప్రజాశక్తి-గన్నవరం : 'గన్నవరం రైతుబజార్లో ధరల దోపిడీ'పై ప్రజాశక్తిలో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు శుక్రవారం స్పందించారు. తహసీల్దారు నరసింహారావు, ఆర్‌ఐ ఉదరు, డిటి ప్రధాన్, రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్ నెంబర్ మూడులో రెండు రకాల ఉల్లిపాయలు అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. షాప్ నెంబర్ 12లో వెల్లుల్లిపాయలు అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించి షాపుల నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరి వద్ద నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసు కున్నారు. అధిక రేట్లకు కూరగాయలు, ఇతర పచారి సామాగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని నరసింహారావు చెప్పారు. ఆ తర్వాత షాపుల వారీగా రైతుల వివరాలు, వ్యాపారుల వివరాలు పరిశీలిం చారు. మీ ఇష్టం వచ్చినట్లుగా వ్యాపారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం పేదలకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో రైతుబజార్ను అందుబాటులోకి తీసుకువచ్చారని, దీంట్లో నిర్ణయించిన రేట్లకే కూరగాయల విక్రయించాలని చెప్పారు. ఎస్టేట్ అధికారి నిర్లక్ష్యంగా ఉండకూడదని అన్నారు. కొంతమంది కావాలని ఈ విధంగా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిని ఉపేక్షించమని తాహసిల్దార్ పేర్కొన్నారు. రైతు బజారులో మొత్తం 65 దుకాణాలు ఉండగా వాటిలో 32 అద్దె ప్రాతిపదికన నడుస్తున్నా యన్నారు. అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు విచారణలో తేలడంతో ఆరు దుకాణాలు మూస ివేయాలని ఆదేశాలు ఇచ్చారు. రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ చంద్రమోహన్, మరో ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.