Sep 05,2023 22:22

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న వ్యకాసం నాయకులు

అధిక ధరలు తగ్గించాలని వినతి
ప్రజాశక్తి కావలి రూరల్‌ : భారతదేశ వ్యాప్తంగా అధిక ధరలు, నిరుద్యోగం, కరెంటు ఛార్జీలు ఉపాధి హామీ, వ్యవసాయ రంగ సమస్యలు గ్రామంలో పారిశుధ్యం సమస్యలను పరిష్కరించాలని మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.మాల్యాద్రి మాట్లాడుతూ నిత్యావసర ధరలు తగ్గించాలన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. విపరీతంగా పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలన్నారు.
ఉపాధి హామీ పనులు ప్రతిష్టంగా అమలు చేయాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని వ్యవసాయ రంగాన్ని కాపాడాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలు అరికట్టాలని మద్యపానాన్ని నిషేధించాలని గ్రామంలో మురుగు నీరు పారిశుధ్యం మెరుగుపరచాలన్నారు. దోమలు విష జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు పి.సీతారామయ్య, ఎస్‌.మద, రాధాకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.