Sep 30,2022 23:11

ఆందోళన చేపడుతున్న కాంగ్రెస్‌ నేతలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: బిజెపి ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకుల ధరలు వెంటనే తగ్గించాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శుక్రవారం మండలంలోని అరకు వారపు సంతలో ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు జి దయానిది మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుక్కోలేక దసరా పండగకు దూరమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. బిజెపి, వైసీపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు. అరకు వారపు సంతలో ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అరకు పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సిహెచ్‌ సాయిబాబా, భోగి మోహన్‌ రావు, వరలక్ష్మి, బి.సులోచన, భీమారావు, సుబ్బారావు, వెంకట్‌బాబు పాల్గొన్నారు.