ఆందోళన చేపడుత్నున కాంగ్రెస్ నేతలు
ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలోని దోడుపుట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈ సంధర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంగడ.నీలకంఠం మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు భారాలు మోయలేక పోతున్నారన్నారు. పెరిగిన సరుకుల ధరలు తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బిజెపి, వైసిపిల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. జోడిపుట్టు పంచాయతీలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాని డిమాండ్ చేశారు. తాగునీరు, సీసీ రోడ్లు , డైనేజిలు వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో గ్రామ నాయుడు కిల్లో రమో, పాంగి నకుల్, కీల్లో బసు, కీల్లో ఇంద్ర సేన్, పాంగి రమ పాల్గొన్నారు.










