Jun 28,2023 20:42

ఎరువుల దుకాణాన్ని పరిశీలిస్తున్న ఎడిఎ

చెన్నూరు : మండలలోని ఎరు వుల దుకాణాలను వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మర్రిపాటి నాగరాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌ బుక్స్‌, ఎరువులు, పురుగుమందులు స్టాక్‌ ఇన్వాయిస్‌లు, ధరల పట్టికలను క్షుణ్ణంగా పరిశీలించారు. తప్పనిసరిగా రైతులకు బిల్లులు అందజేయాలని తెలిపారు. బిల్లులో రైతు పూర్తి పేరు, మొబైల్‌ నెంబరు, ఆధార్‌ నెంబరు పొందుపరచాలన్నారు. ఎంఆర్‌పి కంటే ఎక్కువకు అమ్మ రాదని, డేటు అయిపోయిన ఎరువులు పురుగు మందులు అమ్మ రాదని పేర్కొన్నారు. ఎంఆర్‌పి కన్నా ఎక్కువ తీసుకున్నచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.శ్రీదేవి పాల్గొన్నారు.