దేవనకొండలో పురుగుమందుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న ఎఒ
ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని పెస్టిసైడ్స్ దుకాణాలు నిర్వహించే డీలర్స్ అధిక ధరలకు పురుగుమందులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎఒ సురేష్‌బాబు హెచ్చరించారు. గురువారం దేవనకొండలోని మన గ్రోమోర్, కోరమండల్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు బయోమందులను అమ్మరాదని, కంపెనీ మందులను విక్రయించాలని తెలిపారు. లైసెన్స్ లేకుండా దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పురుగు మందులు కొన్న రైతులకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలన్నారు.










