Aug 28,2023 22:16

జంగారెడ్డిగూడెం : పట్టణంలో అడ్డగోలుగా వసూలు చేస్తున్న అధిక ఆశీల వసూల్లు అరికట్టాలని పలువురు చిరు వ్యాపారాలు వాపోతున్నారు. సోమవారం రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం ఫర్నిచర్‌ షాప్‌లోకి లోడ్‌ వేసుకొచ్చిన డ్రైవర్‌ దగ్గర రూ.200 ఆశీలు వసూలు చేశారని డ్రైవర్‌ రాము ఆవేదన వ్యక్తం చేసారు. ఆశీల వసూల్లు ప్రభుత్వ నిబంధనల మేరకు వసూలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ట్రక్కు డ్రైవర్లు కోరుతున్నారు.