Sep 14,2023 00:18

ప్రజశక్తి - చీరాల
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా స్థానిక కొత్తపేటలోని టిడిపి కార్యాలయం వద్ద ఎన్‌టిఆర్ చిత్రపటంతో టిడిపి ఇన్చార్జి కొండయ్య ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్ష అనంతరం యువ నాయకులు ఎం అమర్నాథ్ నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. దీక్షలలో నాసిక వీరభద్రయ్య, గజవల్లి శ్రీనివాసరావు, తేలప్రోలు నాగేశ్వరరావు, కుంచాల రామాంజనేయులు, కౌతరపు జనార్దనరావు, షేక్ కరీముల్లా, నజీర్ దూదేకుల, షేక్ రజాక్, షేక్ గౌస్, యర్రా శివ మల్లేశ్వరి, పాకల పాండు, కౌతరపు నాగేశ్వరి, లావేటి శ్రీనివాస్ తేజ, పులిపాటి శేఖర్, ఎస్‌కె లాల్ అహ్మద్, బుర్ల రోశయ్య పాల్గొన్నారు.