Sep 19,2023 23:33

ప్రజాశక్తి - చీరాల
స్కిల్ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందని ఆధారాల లేకుండానే అరెస్టు చేయటం, రిమాండ్ విధించడం దుర్మార్గమని టిడిపి ఇంచార్జి ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక కొత్తపేట టిడిపి కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. వైసిపి కుట్రపూరితంగా అరెస్టు చేసిందని అన్నారు. టిడిపికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓటమి భయంతో అక్రమ కేసులు పెట్టారని అన్నారు. దీక్షలో కూర్చున్న వారికి సాయంత్రం నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. కార్యక్రమంలో అంగిరేకుల వెంకటేశ్వర్లు, కనకరాజు, జగదీష్, శ్రీనివాసులు, ఆంజనేయులు, హరిబాబు, శేషగిరి, నారాయణరావు, సోమయ్య, ఉపేంద్ర, శ్రీకాంత్, ఏసుబాబు, చిన్న, నరసింహారావు, కిషోర్, రాజు, తేజ, బాలాజీ, కాళిదాస్, బాలకృష్ణ, వీర్లంకరెడ్డి పాల్గొన్నారు.