Dec 08,2022 23:49

మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు :ప్రతి డిజిటల్‌ సహాయకులు రోజుకి కనీసం 30 ఆధార్‌ కార్డుల అప్డేషన్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. గురువారం కలక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని డిజిటల్‌ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 73 ఆదార్‌ నమోదు కేంద్రాలున్నాయని, సచివాలయ సిబ్బంది ఒక సంవత్సరం లోపు పిల్లల వివరాలు తీసుకుని వారికి ఆధార్‌ చేయించాలన్నారు. ముఖ్యంగా 2010-2016 మధ్య ఆధార్‌ చేయించుకున్న వారికి తప్పనిసరిగా మ్యాండేటరీ బయోమెట్రిక్‌ చేయాలని ఆదేశించారు. కొత్త ఆధార్‌ నమోదులు, డెమోగ్రఫి మార్పులు చిరునామా మార్పులు చేయాలన్నారు. అవసరమైన డాక్యుమెంట్లు లేకుంటే యుఐడి నిర్దేశించిన ఫారం లో గెజిటెడ్‌ అధికారి అటస్టేషన్‌ చేస్తే సరిపోతుందన్నారు. ప్రస్తుతం యుఐడి సాఫ్ట్వేర్‌తో సింగల్‌ ప్రింట్‌ డివైస్‌ ఆప్షన్‌ ఉపయోగింఛి కొత్తగా ఆధార్‌ పొందవచ్చన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్లు సర్వీస్‌ ప్రొవైడర్లుగా సేవలు అందించాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేసారు. ఆధార్‌ లేకుంటే లబ్దిదారులు పలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సేవా భావంతో పని చేయాలని సూచించారు. అవసరమైతే మారుమూల గ్రామాలలో ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ ఫరిదితో సంబంధం లేకుండా ఎవరికైనా ఆధార్‌ చేయాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేసారు.ఆధార్‌ తీసుకుని పది సంవత్సరాలు దాటిన వారిని గుర్తించి అప్డేట్‌ చేయాలని, రానున్న ఎన్నికలలో ఆధార్‌ ఆధారిత ఎపిక్‌ కార్డులకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ వివరించారు. ఆధార్‌ నమోదులు, అప్డేషన్‌, బయో మెట్రిక్‌, బయో మెట్రిక్‌, డెమోగ్రఫి అప్డేషన్లు చేయటంలో సంబంధిత ఎంపిడిఓలు భాద్యత వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ అధికారి రాంగోపాల్‌, జిల్లాలోని డిజిటల్‌ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.