Dec 29,2022 00:01

ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి - రంపచోడవరం
2010 నుండి 2016 మధ్య ఆధార్‌ కార్డులు పొందినవారు వాటిని మళ్లీ అప్‌డేట్‌ చేయించుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. బుధవారం తన ఛాంబర్లో ఆధార్‌ కార్డుల నవీకరణకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను పిఒ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలకు, బ్యాంకు సేవలకు తప్పనిసరిగా ఆధార్‌ ఉండాలన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో 5 మొబైల్‌ ఆధార్‌ కేంద్రాలు, ఐటిడిఏ కార్యాలయంలో ఒక్కటి పని చేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం ఆధార్‌ బ్లూ త్రీ ఐటి కో-ఆర్డినేటర్‌ డేవిడ్‌ పాల్గొన్నారు.