May 08,2023 17:15

మహిళా పోలీసులు,అంగన్వాడి వర్కర్లతో మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌

ఆధార్‌ అప్డేట్‌ చేయించాలి
మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌


ప్రజాశక్తి-డోన్‌
ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేయించాలని డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ పేర్కొన్నారు. సోమవారం డోన్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం నందు మహిళా పోలీసులకు, అంగన్వాడీ వర్కర్లకు మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌ అప్డేట్‌ వల్ల ప్రభుత్వ పథకాలకు, భవిష్యత్తులో పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళా పోలీసులు, అంగన్వాడి వర్కర్లు అనుసంధానమై పిల్లలందరి చేత ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేయించాలని సూచించారు. పట్టణంలోని గాంధీనగర్‌ సచివాలయంలో ఉచితంగా పిల్లలకు ఆధార్‌ సర్వీస్‌ ఉంటుందని,అలాగే కొండపేటలోని మీసేవ నందు ఆధార్‌ సర్వీస్‌ సున్నా నుంచి ఐదు సంవత్సరాలోపు పిల్లలకు ఉచితంగా అప్డేట్‌ చేస్తారని తెలిపారు. ా సమస్యలు ఉంటే మహిళా పోలీసులను, అంగన్వాడి వర్కర్లను సంప్రదించాలని కోరారు.