ప్రజాశక్తి- అనంతగిరి:ఏజెన్సీ ప్రంతంలో ఉన్న అడవుల్ని కాపాడి, ప్రకృతి అందాలను మరింత అబివృద్ది చేయవలసిన బాధ్యత అటవీ శాఖ సిబ్బందిపై ఉందని రాష్ట్ర పిసిసిఎఫ్ వై.మధుసూదనరెడ్డి సూచించారు. మంగళవారం అనంతగిరి మండల చిలకలగెడ్డ ఫారెస్ట్ ఠాణా వద్ద ఏకో టూరిజం ప్రాజెక్ట్ ప్రారంభించారు. అరకులోయకు వచ్చే పర్యాటకులకు ఏజెన్సీ ముఖద్వారం అయినందున సేద తీర్చుకునేందుకు రెస్టారెంట్, చెక్ పోస్టు ఆనుకుని ఉన్న ఎతైన కొండలో 3 కిలోమీటర్ల ట్రక్కింగ్ స్థలం ఏర్పాటు చేశామన్నారు ప్రకృతిని ఆశ్వాదించేందుకు చెట్లు పెంచుతున్నామరు. అడవులు బావితరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని తెలిపారు. గిరిజన ప్రాంతంలోని భవిష్యత్‌లో ఏకో టూరిజం పేరిట అనేక ప్రాజెక్టులు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిసిఎఫ్ శ్రీకాంత్ రెడ్డి, పాడేరు డి ఎఫ్‌ఓ వినోద్‌కుమార్, అనంతగిరి రేంజర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.










