అడవులకు నిప్పు పెట్టవద్దు
- చలమ రేంజ్ అధికారి ఈశ్వరయ్య
ప్రజాశక్తి - రుద్రవరం
చలమ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లో సంచరించే వన్యప్రాణులకు హాని తలపెట్టవద్దని, అడవులకు నిప్పు పెట్టరాదని చలమరేంజ్ అధికారి ఈశ్వరయ్య తెలిపారు. గురువారం నంద్యాలలోని చలమ ఫారెస్ట్ కార్యాలయంలో రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురం, డి కొట్టాల, మహానంది మండలంలోని గాజులపల్లి, గ్రామాల రైతులకు అడవుల సంరక్షణ, వన్యప్రాణులను ఎలా కాపాడుకోవాలి, అడవులకు నిప్పు పెట్టడం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం నల్లమల అడవుల్లో వేసవి కారణంగా వన్య ప్రాణులకు నీరు దొరకక సమీపంలో రైతులు పంట పొలాలకు ఉపయోగించే నీటి కోసం వస్తుంటాయన్నారు. రైతులు అలా వచ్చే జంతువులకు ఉచ్చులు వేయడం, వేటాడం లాంటివి చేయరాదన్నారు. రైతులు, బాటసారులు అటవీ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ నిప్పు వేయరాదని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద కంబలూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాసులు, సెక్షన్ ఆఫీసర్ ఎల్లమ్మ, బీట్ ఆఫీసర్లు నాగప్ప, రామేశ్వరి పలువురు రైతులు పాల్గొన్నారు.










