విజయోత్సాహంలో అప్పలస్వామి ప్యానెల్
సంఘం చరిత్రలో ఇదే మొదటిసారి
ప్రజాశక్తి- సింహాచలం అడివరం ప్రాధమిక సహకార పరపతి సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సొసైటీ చరిత్రలోనే తొలిసారి కర్రి అప్పలస్వామి ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ నెల 24న నోటిఫికేషన్ జారీతో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియలో 25న కర్రి అప్పలస్వామి ప్యానల్ కోలాహలంగా నామినేషన్లు వేసింది. పరిశీలన అనంతరం అన్ని నామినేషన్లు సక్రమంగా ఉండడం, 29 నామినేషన్లు దాఖలైనప్పటికీ, మిగిలిన వారు విత్‌డ్రా చేసుకోవడంతో సెప్టెంబర్ ఒకటిన ఓటింగ్‌కు వెళ్లకుండానే ఎన్నిక ఏకగ్రీవమైంది. కేవలం 13మంది పోటీ బరిలో ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి శ్యామల ప్రకటించారు. విజయం సాధించిన అప్పలస్వామి ప్యానెల్ భారీ ఊరేగింపుతో విజయోత్సవాన్ని నిర్వహించారు.










