Sep 14,2023 00:48

ప్రజాశక్తి- సంతమాగులూరు
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మండలంలోని అడవిపాలెం సర్పంచి దిండు హనుమంతరావు తెలిపారు. కొత్తగా పెన్షన్లు మంజూరైన 16 మందికి బుధవారం సచివాలయంలో ఆయన అందజేశారు. గత టిడిపి ప్రభుత్వం హయాంలో పెన్షనర్లు పింఛన్ తీసుకోవాలంటే రోజంతా పడిగాపులు కాయాల్సి వచ్చేదన్నారు. ఆ సమస్యకు సిఎం వైఎస్‌ జగన్‌ చరమగీతం పాడి ప్రతి పింఛన్ దారుని ఇంటికి వాలంటర్ ద్వారా నేరుగా పింఛన్ అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌ సమత, వీఆర్వో కరీముల్లా పాల్గొన్నారు.