ప్రజాశక్తి - కారెంపూడి : అక్రమార్కులతో కలిసి అటవీశాఖ ఉద్యోగే కలపను అక్రమంగా తరలించడం గురువారం వెలుగులోకి వచ్చింది. వివిధ ప్రాంతాల నుండి కలపను మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో ఉన్న గురజాల రోడ్డుకు తెచ్చి అక్కడి నుండి లారీల ద్వారా తరలిస్తున్నారు. అటవీశాఖ ఉద్యోగి కోటేశ్వరరావు, గ్రామానికి చెందిన నాగరాజు కొన్నేళ్లుగా ఇలా అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిపై కారంపూడి చెందిన అటవీశాఖ సిబ్బంది అమీర్ జానీ, లక్ష్మనాయక్, వీఆర్వో కోటేశ్వరరావుకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టి రూ.లక్షల కలపను స్వాధీనం చేసుకున్నారు. ఒప్పిచర్ల అటవీ ప్రాంతం దుర్గి మండల పరిధిలో ఉండటంతో ఆ ప్రాంత సెక్షన్ ఆఫీసర్ వెంకయ్య కేసు నమోదు చేశారు.










