ప్రజాశక్తి-సాలూరు : ప్రపంచ ఆదివాసీ ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆదివాసీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యాన పారమ్మకొండ వద్ద ఉన్న అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సంఘం మన్యం జిల్లా అధ్యక్షులు జన్ని పైడిరాజు ఆధ్వర్యాన ఉపాధ్యాయులు, ఉద్యోగులు అడవి తల్లి విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా ఇంకా వెనుకబాటుతనం ఉందని చెప్పారు. గిరిజనుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కె.జానకిరావు, సోములు, పణుకువలస సర్పంచ్ సీతారాం పాల్గొన్నారు.
గరుగుబిల్లి : తోటపల్లి ప్రకృతి ఆదిదేవోభవ ప్రాంగణంలో జట్టు సంస్థ ఇడి ఎస్.ప్రహరాజ్ ఆదితల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో డోల్లు సింహాచలం నాయుడు, ప్రధానోపాధ్యాయులు జి.రవికుమార్, పద్మ, మురళీధర్‌రావు పాల్గొన్నారు.










