Jul 01,2023 17:19

అడవి పందులు ధ్వంసం చేసిన విత్తనాలను చూపిస్తున్న రైతు సంఘం నాయకులు

అడవి పందుల నుండి కౌలు రైతులను, రైతులను కాపాడండి

-. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్  
ప్రజాశక్తి - ఆత్మకూర్

     రైతులు కౌలు రైతులు తమ పంట పొలాల్లో విత్తనాలు వేసుకున్నప్పటికీ అడవి పందులు వాటిపై దాడి చేసి విత్తనాలు సైతం చెడగొట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని  ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఏపీ రైతు సంఘం మండల నాయకులు జి కృష్ణమోహన్ రైతులు, జె నాగ స్వామి నాయక్ సుబ్బయ్య పకీరయ్య కే శ్రీను జయమ్మ చిన్నమ్మ నాగమ్మ తదితరులు కలిసి రైతులు వేసిన మొక్కజొన్న పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ అడవికి సమీప గ్రామాలైన కొత్త రామాపురం నల్లగా బాపనంతపురం ముష్టిపల్లి సిద్దపల్లె పెదనంతాపురం సిద్దాపురం వెంకటాపురం బైర్లూటి ఇంద్రేశ్వరం శ్రీపతిరావు పేట కొట్టాల చెరువు కురుకుంద తదితర గ్రామాల రైతులు ప్రతి సంవత్సరం తమ పొలాల్లో విత్తనం నాటిన నుండి పంట చేతికి వచ్చే దశ వరకు తమ పంటలను కంటికి రెప్పలా చూసుకుని కాపాడుకున్న ఫలితం లేకుండా పోతుందని ఆయన అన్నారు. కొత్త రామాపురం గ్రామంలో జై నాగ స్వామి నాయక్ తనకున్న మూడు ఎకరాలలో మొక్కజొన్న విత్తనం నాటడం జరిగింది నాటిన రాత్రి కె అడవి పందులు మందలు మందలుగా వచ్చి వాటి ముట్టెలు (ముఖం) తో ప్రతి సాలును ఏ ఒక్కటి తప్పకుండా గెలికి గెలికి విత్తనాలను తిని పొలాన్ని అంతా నాశనం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇంకా అనేక గ్రామాల్లో చాలామంది రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉందని ఆయన అన్నారు. అడవి పందుల నుండి నష్టపోయిన రైతులందరికీ ప్రతి ఎకరాకు 25 వేల రూపాయల నష్టపోయారు ఇవ్వాలని, అట్లాగే అటవీ అధికారులు రైతుల పొలాల్లోకి అడవి పందులు ఇతర జంతువులు క్రూర మృగాలు రాకుండా అటవీ చుట్టూ, ప్రహరీ గోడలు కంచెలు వేసి, అడవి జంతువులను వన్యప్రాణులను రైతుల పొలాల్లోకి రాకుండా నివారణ నివారించాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులను అందరినీ సమీకరించి అటవీశాఖ కార్యాలయాలను నిర్బంధించి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.