Nov 10,2023 23:13

ప్రజాశక్తి-అమలాపురం
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణ కొరకు జిల్లా క్రీడ ప్రాధికార సంస్థ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్య మంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణ పట్ల 26 జిల్లాల కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడా సంబరాలను డిసెంబర్‌ 15 నుంచి జనవరి 26 వరకు నిర్వహిస్తారన్నారు. పోటీలు ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. క్రీడా టోర్నీ. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో విభాగాల్లో పోటీలు ఐదు దశలలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగు తున్నాయన్నారు.15 ఏళ్లకు పైబడిన బాలబాలికలు ఈ క్రీడలకు అర్హులన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేత త్వంలో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ నియమిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడల్లోనూ లో పోటీలను చేపట్ట నుందని గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి క్రీడాకారులను పోటీలకు ఆహ్వానిస్తోందని. మొత్తం ఐదు దశల్లో ఈ క్రీడా పోటీలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.క్రీడా అథారిటీలకు కూడా కీలక బాధ్యతలు అప్పగిం చారన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలను గుర్తించడం, నిర్వహణకు పిఇటిలు, పీడీలను సిద్ధం చేయడం, దిగువ స్థాయి అధికారులు ఈ క్రీడల నిర్వహణకు వినియోగించడం, క్రీడాకారులకు అవసరమైన రవాణా, ఆహారం, వసతి ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలు గ్రామం, మండల, నియోజకవర్గ జిల్లాస్థాయి ఆర్గనైజింగ్‌ కమిటీలకు అప్పగించామన్నారు. 42 రోజులు పాటు ఈ క్రీడా సంబరాలు ఐదు స్థాయిలలో నిర్వహించడానికి చర్యలు చేపట్ట డం జరిగిందన్నారు. ఈ క్రీడా పోటీలలో ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొనరాదన్నారు. స్పోర్ట్స్‌ ఎక్విప్మెంట్‌ అంతా జిల్లాకు వచ్చిందన్నారు. ఈనెల 20వ తేదీన వాలంటీర్లు క్రీడాకారులు నమోదు ప్రక్రియ చేపడతారన్నారు. ఈనెల 21న స్పోర్ట్స్‌ కిట్స్‌ పంపిణీ, 22న స్కోరింగ్‌ యాప్‌ చెకింగ్‌ ఉంటుందన్నారు. ఈనెల 25వ తేదీ వాలంటీర్లు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లి క్రీడల నిర్వహణ పట్ల కరపత్రాలతో అవగాహన పెంపొందిస్తారన్నారు. జిల్లావ్యాప్తంగా 467 గ్రామాలు 48 వార్డులలో ఈ క్రీడా సంబరాలు జరుగుతాయి అన్నారు. గ్రామస్థాయిలో క్రీడల నిర్వహణ కొరకు ప్రతి సచివాలయం నుంచి పదిమంది వాలంటీర్లను ఎంపిక చేసి ముందుగా శిక్షణ ఇస్తారన్నారు కోనసీమ జిల్లాలో 5,150 మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పాఠశా లలకు చెందిన వ్యాయామ టీచర్లు సచివాలయం వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్‌ అభివద్ధి అధికారులు, ఆర్‌డిఒలు ఈ క్రీడా సంబరాలు నిర్వహణలో కీలక భూమిక పోషించి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లాజెసి ఎస్‌.నుపూర్‌ అజరు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు సురేష్‌ కుమార్‌ ఆడుదాం ఆంధ్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు చేనేత జోళ్లి శాఖ సహాయ సంచాలకులు రాజు తదితరులు పాల్గొన్నారు.