Nov 15,2023 23:31

సదస్సులో మాట్లాడుతున్న ఎంఇఒ వెంకటేశ్వరరావు


ప్రజాశక్తి - భట్టిప్రోలు (వేమూరు)
వేమూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంపై పీఈటీలకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పాఠశాల స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు జరిగే వివిధ రకాల ఆటల పోటీల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చి వారిలో క్రీడా స్ఫూర్తిని నింపాలన్నారు. ఆటల ద్వారా విద్యార్థుల్లో మానసిక శారీరిక దఢత్వం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఒ, ఇఓపిఆర్డి శేఖర్‌ బాబు పాల్గొన్నారు. పర్చూరు : ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా మండలంలోని 20 సచివాలయాల వాలంటీర్లకు ఎంపిడిఓ కార్యాలయంలో గత రెండు రోజులుగా వాలీబాల్‌, క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ ఆటలపై శిక్షణ ఇచ్చారు. డిశంబరు 15నుండి జనవరి 26వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్ధాయిలో ఆటలు జరుగుతాయని ఎంఇఓ సత్యనారాయణ, వెంకటరామయ్య తెలిపారు. క్రీడలలో మంచి ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఓ ప్రద్యుమ్నకుమార్‌, ఇఓఆర్‌డి రామకష్ణ, భాస్కర్‌రెడ్డి, నారాయణరావు, జిల్లా కోచ్‌ పౌల్‌, పిఇటి వీరాస్వామి, సోమయ్య, పౌలస్‌, సురేష్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.