ప్రజాశక్తి - ఏలూరు
దేశాన్ని, సమాజాన్ని రక్షించుకోవడానికి ప్రతిఒక్కరూ సమరయోధుల నుండి ప్రేరణ పొంది ముందుకు సాగాలని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ అన్నారు. మంగళవారం రాత్రి కోటదిబ్బలో ఉన్న సీతారామ భర్తియా కళ్యాణ మండపంలో ఎవిఆర్ విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కళానీరాజనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సాబ్జీ మాట్లాడారు. దేశంలో ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉండటం బాధాకరమన్నారు. దేశ ప్రజల సంపదను దోపిడీ నుండి కాపాడుకోవడానికి అల్లూరి సీతారామరాజు జీవితం నుండి ప్రేరణ పొందాలన్నారు. అనంతరం విజ్ఞానకేంద్రం సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, సభ అధ్యక్షులు వై.ఆనందనాయుడు, విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ తరపున విజిఎంవిఆర్.కృష్ణారావు, ఎస్‌వి.సుబ్రహ్మణ్యం విద్యార్థులకు బహుమతులు, పుస్తకాలు అందజేశారు. సభలో అతిథిగా సెట్ వెల్ సిఇఒ ఎమ్‌డి మెహర్ రాజా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు కెఎస్‌కె సత్యనారాయణ, పీడీ.రత్నాకర్ రావు, ఎస్.కస్తూరిరావు, పి.ఆంజనేయులు, మేతర అజరుబాబు, ఎన్.గంగాభవాని, వై.అర్జునరావు, వి.సురేష్, పి.హైమావతి, కె.శ్రావణకుమారి, డి.గణేష్, ఎస్.రవి, పి.ప్రసాద్ వేదికను అలంకరించారు. కళా ప్రదర్శనలిచ్చిన 40 మంది కళాకారులకు, వివిధ విద్యాలయాల్లో నిర్వహించిన అకాడమిక్ పోటీల విజేతలు 120 మందికి ప్రశంసాపత్రాలు, అల్లూరి జీవిత చరిత్ర పుస్తకాలు, జ్ఞాపికలు సాబ్జీ, ఇతర అతిథుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.లింగరాజు, వి.సాయిబాబు, జాన్‌బాబు, జింగిల్ బెల్స్ స్కూల్ డైరెక్టర్ కడియాల విజయలక్ష్మి, కోలాట బృంద సమన్వయకర్త వై.విష్ణుమహేశ్వరి, నృత్యాంజలి నృత్య నికేతన్ నాట్యాచార్యుడు గండికోట రాజేష్, స్వర్ణాలయం నృత్యాలయం నాట్యాచారిణి స్వర్ణలత, కె.శ్రీనివాసరావు, గాయకులు పి.సూర్యప్రకాశరావు, రంగవరప్రసాద్, ఎం.వెంకట్రా వు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
భీమడోలు:స్వాతంత్ర ఉద్యమ లక్ష్యాల సాధనకు యువత నడుం బిగించాలని ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహా రావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పది విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు సిఐటి యు, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలను నిర్వహించారు. విజేతలకు భీమడోలులోని డిపాల్ హైస్కూలో బుధ వారం నిర్వహించిన కార్యక్రమంలో బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా గుడిపాటి నరసింహారావు తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనం తరం డిపాల్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ నెల్సన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్‌రావు, కెవిపిఎస్ మండల కన్వీనర్ సుమన్‌బాబు ప్రసంగించారు .










