ఘనంగా గణిత దినోత్సవం
ప్రజాశక్తి - ముసునూరు
ప్రతి విద్యార్థి శ్రీనివాస్ రామానుజన్ వలే గొప్ప శాస్త్రవేత కావాలని ముసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో గణిత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు రత్నమాల, నాగేశ్వరరావు, బాబూరావులు గణిత శాస్త్రంతో కూడిన సైన్సు పార్కు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.సుకు మార్, అల్లాభిక్షు, రంగారావు, యువరాజు, రత్నమాల, నాగేశ్వరరావు, బాబూరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
టి.నరసాపురం : నేటి విద్యార్థులందరూ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మండల విద్యాశాఖాధికారి టి.రామ్మూర్తి అన్నారు. స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు పురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అరుణ, మహాలక్ష్మి, వరలక్ష్మి, లావణ్య, అనూష, కల్యాణి పాల్గొన్నారు.
చింతలపూడి : చింతలపూడి పట్టణంలో చైతన్య టెక్నో పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ 135వ జయంతి సందర్భంగా విద్యార్థులు గణిత నమోనాలను తయారుచేసి ప్రదర్శించారు. క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం గణిత ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.సత్యనారాయణ, డీన్ మధుబాబు పాల్గొన్నారు.
చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లా డారు. రామానుజన్ చిన్న వయసులోనే గణితంలో ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎన్‌కెజె.నరేంద్రకుమార్, గణిత శాస్త్ర శాఖాధి పతి డాక్టర్ డి.దేవానందం, ఆంగ్ల శాఖధిపతి బి.శ్రీనివాస రావు, ఐక్యూ ఎసి కో-ఆర్డినేటర్ డాక్టర్ సయ్యద్ అసిం, సీనియర్ అధ్యాపకురాలు ఎన్.మణిమాల పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : స్థానిక ప్రతిభ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు రామానుజన్ నెంబర్ 1729 ఆకా రంలో ఒదిగిన విన్యాసాలతో కనువిందు చేశారు. గణితానికి సంబంధించిన పలు రకాల ఫార్ములాలు ఈక్వే షన్స్ ప్రద ర్శించారు. పాటలు నృత్యాలు, ఉపన్యాసాలతో రా మానుజన్ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, ప్రిన్సిపల్ సరోజారెడ్డి పాల్గొన్నారు.
చాట్రాయి : గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 136వ జయంతిని మండలంలోని పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రీనివాస రామానుజాన్ చిత్రపటానికి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.కేశవరెడ్డి మాట్లాడుతూ గణితం మానవుని జీవితంలో నిత్యం ఉపయోగపడుతుందన్నారు. కష్టపడి నేర్చుకుంటే గణితం సులభంగా అర్థమవుతుందన్నారు. గణిత ఉపాధ్యాయుని ఎస్.నీలిమ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి పెరిగి తన మేదస్సుతో, పట్టుదలతో, కృషితో గణిత సిద్ధాంతాలను రూపొందించారని, ఎన్నో సిద్ధాంతాలకు పరిష్కారం చూపించిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని కొనియాడారు. అనంతరం గణిత క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.రత్తయ్య, ఎస్.నీలిమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
నూజివీడు : జాతీయ గణిత దినోత్సవాన్ని ఆర్‌జియుకెటి నూజివీడు క్యాంపస్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఎస్.శ్రీనివాస్ విఐటి అమరావతి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్‌జియుకెటి నూజివీడు గణిత విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేష్ బండారి యాదవ్ రూపొందించిన షశీసవ జూతీaఞఱర.వఅస్త్రఱఅవవతీఱఅస్త్ర ఎa్‌ష్ట్ర.శీఅశ్రీఱఅవ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. చివరిగా గణిత విభాగం నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్, డీన్ అకాడమిక్, డాక్టర్ గౌతమి, హెచ్‌ఒడి, మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏలూరు అర్బన్ : స్థానిక పడమర వీధిలో ఉన్న లిటిల్ బర్డ్స్ కాన్వెంట్‌లో మ్యాథమెటిక్స్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు శ్రీనివాస రామానుజన్ గురించి వేసిన చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల అధ్యాపకులు కిషోర్, ఎం.శ్రీనివాస్, జి.సత్యనారాయణ పాల్గొన్నారు.
ముదినేపల్లి : ముదినేపల్లిలోని గౌతమ్ హైస్కూల్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సీనియర్ ఉపాధ్యాయులు కెవి.సుబ్బారావు చేతులు మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్సాండెంట్ మదన్‌కిషోర్, ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










