Mar 12,2023 01:28
నేతాజీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు

ప్రజాశక్తి-చీరాల: బ్రిటిష్‌ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గడగడలాడించిన మహనీయులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం కోసం పోరాటం చేసిన మహానుభావులలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు అని బ్రిటిష్‌ వారిని గడగడలాడించిన ధీశాలి అన్నారు. ఈ తరం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించాలి అని తెలిపారు.అనంతరం నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఫలహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, అన్నంరాజు సుబ్బారావు, శీలం రవి తదితరులు పాల్గొన్నారు.