ఫొటో : ప్రిన్సిపల్‌తో మాట్లాడుత్ను ఫుడ్‌కమిషన్ చైర్మన్ విజరుప్రతాప్‌రెడ్డి
ఆదర్శపాఠశాలలో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని నందవరం ఆదర్శ పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజరుప్రతాప్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన పాఠశాలను, పాఠశాల గదులను, బాలికల హాస్టల్‌ను, స్టాక్ రూమ్‌ను పరిశీలించి, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందుతుందా.. లేదా.. రుచిగా.. ఉంటుందా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాలికల హాస్టల్ పిల్లలకు అందించే భోజనంలో నాణ్యతా ఉండాలన్నారు. అలాగే విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్‌ను రుచి చూచి సంతృప్తి వ్యక్తం చేశారు. కాలం చెల్లిన పదార్థాలను తీసుకోవద్దని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఆయనవెంట ప్రిన్సిపల్ శ్రీనివాసులు బోధన సిబ్బంది ఉన్నారు.










